NTV Telugu Site icon

Sikkim: సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు

Sikkim

Sikkim

సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి.. ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే.. భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగన్ జిల్లాలోని పక్షేప్ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగ్‌రాంగ్ సమీపంలో ముగ్గురు, పక్షేప్ నుండి ఇద్దరు మిస్సింగ్ అయినట్లు అధికారులు తెలిపారు.

Read Also: ATM Withdrawal Charges: అలర్ట్.. భారీగా పెరగనున్న క్యాష్​ విత్​డ్రా ఛార్జీలు​..

మరోవైపు.. భారీ వరదలతో తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో సిక్కింలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలోని మెల్లి స్టేడియంను వరదలు ముంచెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. గీతాంగ్‌లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. పెంటోక్ సమీపంలోని నాంపతంగ్ వద్ద రోడ్లు దెబ్బతిన్నాయి. ఉత్తర సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మొబైల్ నెట్‌వర్క్ సేవలకు అంతరాయం కలిగింది. మరోవైపు.. మంగన్ జిల్లాకు రేషన్ సరఫరాలతో కూడిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాన్ని జిల్లా యంత్రాంగం అభ్యర్థించింది.

Read Also: PK Mishra: ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా..మోడీతో ఆయనకున్న సంబంధమేంటి?

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్.. విపత్తుపై ఉత్తర జిల్లా యంత్రాంగం, పోలీసులు ఇతర అధికారులతో మాట్లాడారు. “బాధితులు, బాధిత కుటుంబాలకు రికవరీ సహాయం, తాత్కాలిక పరిష్కారం.. ప్రాథమిక అవసరాల సదుపాయంతో సహా సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని తమాంగ్ చెప్పారు. “బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది.. మృతుల కుటుంబాలకు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన, నిరాశ్రయులైన వారందరికీ ఆదుకుంటామని” తెలిపారు.