NTV Telugu Site icon

Heavy Rains: నాగ్‌పూర్‌లో భారీ వర్షం.. స్కూళ్లు, కాలేజీలు మూసివేత

Nagpur Rains

Nagpur Rains

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. నగరంలో కురిసిన భారీ వర్షానికి నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోకి నీరు చేరింది. దాంతో పాటు సిటీ బస్ డిపోలో పార్క్ చేసిన కొన్ని బస్సులు మునిగిపోయాయి. అంబజారి సరస్సు పొంగిపొర్లడంతో పలు ఇళ్లలోకి కూడా నీరు చేరింది.

Posani: పురంధేశ్వరిపై పోసాని సంచలన వ్యాఖ్యలు

జాతీయ విపత్తు ప్రతిస్పందన (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు వరదల్లో చిక్కుకున్న ఇళ్లు, వీధుల నుండి ప్రజలను రక్షిస్తున్నారు. రెండు యూనిట్లు లోతట్టు ప్రాంతాల నుండి నివాసితులను SDRF బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. ఇప్పటి వరకు 140 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అంతేకాకుండా వినికిడి, మాట్లాడలేని 40 మంది పిల్లలను ఓ పాఠశాల నుండి రక్షించినట్లు ఆయన పేర్కొన్నారు.

Nabha Natesh: శారీ పిక్స్ తో మనుసు దోచుకుంటున్న నభా నటేష్

మరోవైపు అత్యవసరం ఉంటేనే ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సూచించారు. మరోవైపు భండారా, గోండియా జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అంతేకాకుండా.. నేడు అమరావతి, యవత్మాల్, గడ్చిరోలిలో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

India-Canada: భారత్ లేదా కెనడా అని తేల్చుకోవాల్సి వస్తే.. మేం వారి వెంటే, అమెరికా అధికారి కీలక వ్యాఖ్యలు..

నాగ్‌పూర్, నాసిక్, థానేతో సహా మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుండి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు, పలు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు చోట్ల వరదలు, వరదలు తలెత్తే పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ ఇప్పటికే భారీ వర్షం హెచ్చరిక జారీ చేసినందున, వర్షం ప్రారంభమైన వెంటనే రెస్క్యూ ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి.