Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం..

Rain

Rain

హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాన దంచికొడుతుంది. అబిడ్స్, కోఠి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నిన్నటి నుంచి (బుధవారం) తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి.. ఆ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. అంతేకాకుండా.. నిన్న ఉదయం నుంచి మొదలుపెడితే ఈరోజు వరకు వాతావరణం చల్లగానే ఉంది. తాజాగా.. నగరంలో భారీ వర్షం పడుతోంది.

Read Also: AP Crime: రూ.300 కోసం ఘర్షణ.. ఒకరు మృతి

రాష్ట్ర వ్యాప్తంగా చిరు జల్లులు కురుస్తుండటంతో చలి తీవ్రత ఎక్కువైంది. బుధవారం ఉదయం నుంచే తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. మరోవైపు.. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. చలికాలంలో వర్షం పడుతుండటంతో చలి తీవ్రత పెరిగి జనాలు అవస్థలు పడుతున్నారు.

Read Also: IG Satyanarayana: పట్నం నరేందర్ రెడ్డికి ఐజీ వార్నింగ్.. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తాం

Exit mobile version