Hyderabad Rains : హైదరబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్రమైన పొడి, వేడి వాతావరణం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని తెచ్చి, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తూర్పు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, నాగోల్, సరూర్‌నగర్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. నాగారం, కీసర, ECIL, మౌలా అలీ మరియు దమ్మాయిగూడలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే పలుచోట్ల పిడుగులు పడ్డాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కీసర, ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి.
ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతంలో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి. మల్కాజ్గిరి, తుర్కయాంజ్‌లో ఈదురుగాలులు వీయగా.. వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులుపడ్డాయి. అలాగే, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట పరిధిలోనూ ఈదురుగాలులతో వర్షం వాన కురిసింది. నాగోల్, మన్సూరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలీపురంలో గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. శామీర్ పేటలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలి తాకిడికి రోడ్డుపై వెళ్తున్న బైకర్ పై ఓ చెట్టు పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!