Site icon NTV Telugu

Rain Alert : తెలంగాణకు ఆరెంజ్‌ అలర్ట్‌..

Rain

Rain

వేసవికాలం తాపంతో మండిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించాడు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో నేడు భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్‌ నగర్, మలక్ పేట, చార్మినార్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులపై వర్షపు నీరు వచ్చి చేరింది.

Also Read : Mallikarjun Kharge: మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడవడం లేదు

రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం.. గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ఈదురు గాలల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిలమైన భవనాల వద్ద ఉండకూడదని హెచ్చరింది. అయితే.. అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది.

Also Read : Bandi sanjay wife: ఎమోషన్స్ లేని ఈ ప్రభుత్వానికి “బలగం” సినిమా చూపించాలి

Exit mobile version