NTV Telugu Site icon

Bhadrachalam: గోదావరి వరదలు గుర్తు చేసిన భారీ వర్షం.. రామాలయం చుట్టూ చేరిన నీరు

Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam: ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో రామాలయం వద్ద ఉన్న అన్నదానం సత్రం చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. రామాలయం వద్ద నీళ్లు చేరి అంతా చెరువులా మారింది .రామాలయం వద్ద నుంచి గోదావరిలోకి వెళ్లే డ్రైనేజీ నీళ్లు వెళ్లే స్లూయిస్‌లు ఓపెన్ కాకపోవడంతో నీళ్లన్నీ రామాలయం ఉత్తర భాగంలో ఉన్న రోడ్ల మీదకి నీళ్లు వచ్చాయి. అన్నదాన సత్రం చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గోదావరి భారీ ఎత్తున వరదలు వచ్చిన సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి వద్ద ఉన్న అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడం ప్రతి ఏడాది జరుగుతుంది. కానీ మామూలు వర్షాలకు కూడా అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడం ఇదే మొదటిసారి. అదేవిధంగా అక్కడే ఉన్న దుకాణాల సముదాయం లోకి నీళ్లు చేరుకున్నాయి. ఒక్క సారిగా వచ్చిన వర్షానికి భక్తులు ఇక్కట్లు గురయ్యారు. మెట్ల మార్గం మీద నుంచి ఎక్కడానికి వీలు లేకుండా నీళ్లు చేరుకున్నాయి. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందనేది ఆరోపణ. ప్రధానంగా స్లూయిస్‌లను వేసవి కాలంలో మరమ్మతులు చేయడం జరుగుతుంది.

Read Also: Telangana: తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులు.. చర్యలు చేపట్టిన ప్రభుత్వం

ప్రధానంగా భద్రాచలంకు గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా రెండవ ప్రమాద హెచ్చరిక తర్వాత స్లూయిస్‌లు బ్రేక్ కావడం జరుగుతుంది. ఆ నీళ్లే అన్నదాన సత్రంలోకి రామాలయం మెట్ల మార్గం వరకు రావటం అనేది గోదావరి వరదలు వచ్చినప్పుడు జరిగేది. కానీ ప్రస్తుతం మాత్రం ఒక్కసారిగా వచ్చిన వర్షపు నీరు అంతా కూడా రామాలయం వద్ద చేరుకొని ఇక్కడే పేర్కొని పోవటం అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. అయితే వర్షం తగ్గిపోవడంతో నీళ్లన్నీ దిగువకి వెళ్లిపోయాయి.దీంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే భద్రాచలం పట్టణంలో విద్యుత్ స్తంభం విరిగిపడి కరెంటు నిలిచిపోయింది. ఇదిలా ఉంటే కొత్తగూడెం పట్టణంలో ఒక్కసారిగా వర్షాలు రావడంతో పట్టణ ప్రజలకు ఉపశమనం లభించింది. పాల్వంచ మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో వర్షం వచ్చింది. అయితే బోజ్యా తండాలో పిడుగుపాటుకు ఒక ఎద్దు, ఒక ఆవు మృతి చెందాయి.