NTV Telugu Site icon

Uttar Pradesh: ఇంకా వరదనీటిలోనే ఉన్నావ్ గ్రామం.. తీవ్ర ఇబ్బందుల్లో జనాలు

Up

Up

ఉత్తరప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వర్షాలకు ఉన్నావ్‌లో వరదనీరు ముంచెత్తింది. అంతేకాకుండా.. డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఉన్నావ్‌ గ్రామం నీటిలో మునిగిపోయింది. మరోవైపు అక్కడి నివాసముండే ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. అంతేకాకుండా.. రోడ్లు, కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. అక్కడి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అత్యవసరంగా ప్రజలు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల సహాయంతో వెళ్తున్నారు. తీసుకోవాలి. వరదనీటిని తగ్గించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ విఫలమైనట్లు తెలుస్తోంది.

Botsa Satyanarayana: ఉగాది తర్వాత ఆ సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్.. ఈ 6 నెలలే అరుపులు, కేకలు..

ఉన్నావ్‌లోని గంగానది ఒడ్డున నివసించే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గంగానది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి కొద్ది దూరంలోనే ఉండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నారు. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం గంగానది నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచాలని డీఎం అపూర్వ దూబే ఆదేశాలు ఇచ్చారు. దీంతో వరద సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు 26 గ్రామాలు వరదల బారిన పడ్డాయని, ప్రజలకు సహాయం కోసం కొన్ని నిత్యావసర సామాగ్రిని అందిస్తున్నామని డీఎం తెలిపారు.

Minister KTR: ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఎన్నికలు

మరోవైపు పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా.. బంగర్‌మావు, సఫీపూర్, ఉన్నావ్ సదర్ మరియు బిఘపూర్ కత్రిలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నావ్ సదర్ ప్రాంతంలోని శుక్లగంజ్, రాజీవ్ నగర్ ఖాంటి, అహ్మద్‌నగర్, మనోహర్ నగర్, రెహ్మత్ నగర్ మరియు గంగానగర్ ప్రాంతాల్లోని డైవర్లు వరదల కారణంగా ఇంటిపైకప్పులపై ఉంటున్నారు.

Boys Hostel: రేయ్ ఎవర్రా మీరంతా.. రష్మీ అందాన్ని పక్కన పెట్టి రక్తం అలా తాగేస్తున్నారు?

అదే సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వరద సహాయక కేంద్రం, వరద నియంత్రణ కేంద్రాలను సంప్రదించవచ్చని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో వరదల కారణంగా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరద నీరు ప్రవహించడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆ ప్రాంత వాసులు తెలిపారు.

Show comments