Boys Hostel: రేయ్ ఎవర్రా మీరంతా.. రష్మీ అందాన్ని పక్కన పెట్టి రక్తం అలా తాగేస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boys Hostel Theatrical Trailer : అన్నపూర్ణ స్టూడియోస్, కంటెంట్ బేస్డ్ చిత్రాలని రూపొందించే చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌తో కలిసి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘హాస్టల్ హుడుగారు బేకగిద్దరే’ ని ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమా కోసం తరుణ్ కుమార్ దాస్యం, రష్మీ గౌతమ్ అతిథి పాత్రల్లో నటించారు. అదే విధంగా రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఒక నిర్మాతగా వరుణ్ గౌడ, ప్రజ్వల్, అరవింద్ కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్, వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించగా పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పించారు.
Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
Also Read
ఈ సినిమా గత నెలలో కన్నడలో విడుదలై యునానిమస్ పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికే 20+ కోట్లు వసూలు చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను బేబీ సినిమా టీమ్ చేత రిలీజ్ చేయించారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగింది. ఒక బాయ్స్ హాస్టల్ లో వార్డెన్ అనూహ్యంగా మరణిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశం మీద ఈ సినిమా తెరకెక్కినట్టు అర్ధం అవుతోంది. ఇక ఈ క్రమంలో రష్మీ లాంటి అందం పక్కన ఉన్నా ఈ ట్రైలర్ లో ఏకంగా కుర్రాళ్ళు రక్తం తాగుతున్న అంశం హైలైట్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్ మీరూ చూసేయండి.
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి