Site icon NTV Telugu

Heat wave Warning: తెలుగు రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు

Elele

Elele

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే నాలుగు, ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ ఉందని.. దీని స్థాయిని పెంచాల్సిన అవసరం వస్తుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Vijay Devarakonda :ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న రౌడీ హీరో..?

ఉష్ణ తరంగాల ప్రభావం భారత్‌పై అధికంగా ఉందని పేర్కొంది. ఈ వేడి తరంగాలు రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని స్పష్టం చేసింది. గంగా నదిపై నాలుగు రోజులు, ఒడిశా, జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు హీట్ వేవ్‌కు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఇక రాబోయే 4-5 రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఆరెంజ్ హెచ్చరిక స్థాయి పెంచుతామని ఐఎండీ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: B.Vinod Kumar: ఆగస్టు 15 అన్నారు.. డేట్ మార్చి జనవరి 26న రుణమాఫీ అంటారు..

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుకున్నారు.  ఉదయం నుంచి భానుడు భగభగమండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది.

 

Exit mobile version