తెలుగు రాష్ట్రాల్లో వేసవి తీవ్రత బాగా పెరుగుతోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఐఎండి అంచనాల ప్రకారం రేపు 6 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రకటన విడుదల చేశారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల జాబితా ఈ విధంగా ఉంది,
అల్లూరి జిల్లా :- కూనవరం
అనకాపల్లి:– నాతవరం
కాకినాడ :- కోటనందూరు
మన్యం:-జీయమ్మవలస, కొమరాడ, పార్వతీపురం
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(174) :-
అల్లూరి జిల్లా 10,
అనకాపల్లి 17,
తూర్పుగోదావరి 17,
ఏలూరు17,
గుంటూరు12,
కాకినాడ 13,
కోనసీమ 4,
కృష్ణా 9,
నంద్యాల 8,
ఎన్టీఆర్ 16,
పల్నాడు 7,
పార్వతీపురంమన్యం 9,
శ్రీకాకుళం 8,
విశాఖపట్నం 3,
విజయనగరం 22,
పశ్చిమ గోదావరి 1,
వైఎస్ఆర్ 1 మండలంలో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శనివారం అనకాపల్లి 10, కాకినాడ 2, విజయనగరం 1 మండలంలో తీవ్రవడగాల్పులు వీయనున్నాయి. 55 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళవద్దని ఐఎండీ సూచించింది.