Health Tips: కిడ్నీల ఆరోగ్యం కోసం వీటిని తప్పక తీసుకోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం బాడిలో కిడ్నీలు చాలా ముఖ్యం.. ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం..వాటికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.. శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలు కిడ్నీలు. రక్తాన్ని శుద్ధి చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి.. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.. ఎలాంటి
యాపిల్..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
రోజుకో యాపిల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. యాపిల్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు ఇవి ఉపకరిస్తాయి. డయాబెటిస్ వల్ల కిడ్నీలకు ముప్పు ఎక్కువ. కాబట్టి ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సమస్యలను తగ్గించుకోవచ్చు.. కిడ్నీల ఆరోగ్యంలో దోహదపడతాయి..
వెల్లుల్లి..
వెల్లులితో శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల నుంచి అనవసర వ్యర్థాలు బయటకు పంపేందుకు వెల్లులి తోడ్పడుతుంది. వీటిని పచ్చిగా లేదంటే వంటల్లో వేసుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..
ఓట్స్..
ఓట్స్‌లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇందులో ‘బీటా గ్లూకాన్’ అనే నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఓట్స్ వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.
నీరు..
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంలే రోజు క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. నీరు శరీరాన్ని డీహైడ్రేషన్‌కు కాకుండా రక్షిస్తుంది. రోజూ 7-8 గ్లాసుల నీళ్లు తాగాలి. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలకు హాని కలిగించే విషతుల్య పదార్థాలు శరీరం నుంచి తేలిగ్గా బయటకు వెళ్లిపోతాయి..
లావు మిర్చీ..
లావుగా ఉండే ఎర్రటి మిర్చీలో విటమిన్-A, విటమిన్-C ఉంటాయి. ఇవి ఆక్సిడెంట్లలా పని చేస్తాయి. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. దీని వల్ల కిడ్నీలకు మేలు జరుగుతుంది. తగిన మోతాదులో వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. అయితే, ఇవి మార్కెట్లో అరుదుగా లభిస్తాయి..
స్ట్రాబెర్రీలు..
వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే మాంగనీస్, పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పని చేసేందుకు సహకరిస్తాయి.
ఉల్లిపాయలు..
ఉల్లిపాయలు బీపీని తగ్గిస్తాయి. మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది. ఇక కిడ్నీలపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు..
పుట్టగొడుగులు..
పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్-B, విటమిన్-D కిడ్నీ జబ్బులను దూరం చేస్తాయి. రకరకాల పుట్టగొడుగుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి..
క్లాలిప్లవర్..
కాలిఫ్లవర్‌లో విటమిన్ K, విటమిన్ C, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. కాలిఫ్లవర్‌లో ఉండే సల్ఫర్, పొటాషియం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేస్తాయి. ఫలితంగా కిడ్నీల పని తీరు మెరుగవుతుంది…
వీటిని రోజూ మీ ఆహారంలో చేర్చుకుంటే మీ కిడ్నీల సమస్యలు దూరం అవుతాయి.. ఇంకా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!