Fennel Seeds: ఇందుకే కాబోలు భోజనం తర్వాత సోంపు గింజలను తినేది.!
- సోంపు గింజలు ఒక మసాలా దినుసు.
- ఇవి అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయి.
- దుర్వాసన నుండి ఉపశమనం
- మెరుగైన జీర్ణక్రియ లాంటి ఉపయోగాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fennel Seeds: సోంపు గింజలు ఒక మసాలా దినుసు. ఇది రుచికరమైన రుచి మాత్రమే కాకుండా, ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. ఇది ఊరగాయలు, సుగంధ ద్రవ్యాల రుచిని మెరుగుపరచడానికి, మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించబడుతుంది. పీచు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న సోంపును తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఫైబర్, క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సోపు నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
మెరుగైన జీర్ణక్రియ:
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
సోంపులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో, అపానవాయువు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. సోపు గింజలను రోజూ నమలడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని గింజల్లో అనెథోల్, ఫెంచోన్, ఎస్ట్రాగోల్ ఉండటం వల్ల అవి యాంటిస్పాస్మోడిక్ తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దింతో మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
స్థూలకాయాన్ని దూరం చేస్తాయి:
సోంపు గింజల వాటర్ పెరుగుతున్న బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. దీన్ని తినడం వల్ల త్వరగా ఆకలి అనిపించదు. దీని వల్ల అతిగా తినడం మానేయవచ్చు. దీంతో ఊబకాయం సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సోపు నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
అదుపులో రక్తపోటు:
సోంపులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫెన్నెల్ నమలడం వల్ల లాలాజలంలో జీర్ణ ఎంజైమ్‌ల పరిమాణం పెరుగుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు రోగులకు సోపు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాకుండా, దీన్ని నమలడం వల్ల లాలాజలంలో నైట్రేట్ పరిమాణాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
దుర్వాసన నుండి ఉపశమనం:
చాలా మందికి తరచుగా నోటి దుర్వాసన ఉంటుంది. దానిని తొలగించడానికి చాలా మంది మౌత్ ఫ్రెషనర్‌ని ఉపయోగిస్తారు. సోంపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది నోటి దుర్వాసనను తొలగించి దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీన్ని రోజుకు 3 లేదా 4 సార్లు తీసుకుంటే నోటి దుర్వాసన పోతుంది.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!