NTV Telugu Site icon

Viral News: దొంగ భక్తుడు.. హనుమంతుడికి పూజలు చేసి, కిరీటాన్ని దొబ్బేశాడు..(వీడియో)

Viral News

Viral News

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

READ MORE: Maharashtra: క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బ్యాట్స్ మెన్‌ మృతి (వీడియో)

మీర్జాపూర్‌.. చిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జున్‌పూర్ ముజెహ్రా హనుమాన్ ఆలయంలో డిసెంబర్ 27న ఈ ఘటన జరిగింది. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ దొంగ ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ ముందుగా ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశాడు. ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుడి విగ్రహానికి నమస్కారం చేశాడు. ఆపై ఆ విగ్రహానికి పెట్టిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆలయ పూజారి అశోక్ దూబే పోలీసులకు సమాచారం అందించారు.

READ MORE: Hyderabad: సెల్‌ఫోన్ వాడొద్దని మందలించిన తండ్రి.. కూతురు అదృశ్యం

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే పూజారి అశోక్ దూబే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దొంగ కోసం గాలిస్తున్నారు. “ఆలయంలో కిరీటం చోరీకి గురైనట్లు మాకు సమాచారం అందింది. దీనిపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. మా బృందం ఈ విషయంలో యాక్టివ్‌గా ఉంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం.” అని స్టేషన్ సీఓ సదర్ అమర్ బహదూర్ సింగ్ తెలిపారు.

Show comments