Site icon NTV Telugu

The Rajasaab: ప్రభాస్ ‘రాజాసాబ్’పై కాపీ ఆరోపణలు.. తమన్‌కు విదేశీ డీజే వార్నింగ్

Rajasab Taman

Rajasab Taman

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. హారర్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, విజువల్స్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇండస్ట్రీలో కాపీ రైట్ వివాదాలు కామన్. కానీ ఇందులో ముందు వరుసలో ఉండేది మాత్రం సంగీత దర్శకుడు తమన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక తాజాగా ఇదే విషయంలో మరోసారి ఇరుకున్నాడు తమన్. ఈ సినిమాలోని ‘నాచే నాచే’ పాట ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. తమన్ అందించిన ఈ పాట ట్యూన్, స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే విడోజిన్ రూపొందించిన ‘అలమియో’ (Alameyo) సాంగ్‌ను పోలి ఉందంటూ కాపీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా, ఏకంగా ఒరిజినల్ కంపోజర్ విడోజిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం సంచలనంగా మారింది.

Also Read : Aishwarya Rajesh : ‘ఓ సుకుమారి’ మూవీ నుంచి హోమ్లీ లుక్‌లో పలకరించిన ఐశ్వర్య రాజేష్

విడోజిన్ తన వీడియోలో రెండు పాటల ట్యూన్స్‌ను ప్లే చేస్తూ.. అవి రెండు ఒకేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, తన చెప్పును చూపిస్తూ తమన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ విషయంలో ప్రభాస్‌కు ఎటువంటి సంబంధం లేదని, ఆయన గొప్ప నటుడని విడోజిన్ కొనియాడటం విశేషం. మరోవైపు, ఈ సినిమా ‘భూల్ భులయ్యా’ తరహాలో ఉందనే విమర్శలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్ రిద్ది కుమార్ స్పందించారు. ఇది పూర్తిగా కొత్త ఫాంటసీ ప్రపంచమని, ఇతర సినిమాలతో పోలిక లేదని స్పష్టం చేశారు. మరి ఈ మ్యూజిక్ కాపీ వివాదంపై తమన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

Exit mobile version