Aishwarya Rajesh : ‘ఓ సుకుమారి’ మూవీ నుంచి హోమ్లీ లుక్‌లో పలకరించిన ఐశ్వర్య రాజేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత హిట్‌లు మాత్రం పడలేదు. కానీ లాస్ట్ ఇయర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది ఐశ్వర్య. అప్పటి నుంచి వరుస ప్రాజెక్ట్ లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రజంట్ హీరో తిరువీర్ సరసన ‘ఓ..! సుకుమారి’ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ రూపొందిస్తున్న ఈ క్యూట్ విలేజ్ ఎంటర్‌టైనర్‌ను గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తాజాగా,
ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘దామిని’ అనే అల్లరి చేసే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. రంగురంగుల పరికిణీ వోణీ కట్టుకుని, చేతిలో కర్రలు పట్టుకుని ఊరి జనం నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతున్న ఆమె లుక్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర ఎంత చురుగ్గా, వినోదాత్మకంగా ఉండబోతుందో అర్థమవుతోంది. ఇక ఈ సినిమా కేవలం వినోదమే కాకుండా మంచి ఎమోషన్స్.. డ్రామాతో కూడి ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి శిష్యుడు భరత్ మంచి రాజు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, సి.హెచ్ కుషేందర్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ‘పొలిమేర’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, హోమ్లీ లుక్‌తో మెప్పించే ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!