NTV Telugu Site icon

Road Accident: ఓ పక్క పుత్రశోకం.. మరోపక్క వేల రూపాయలు డిమాండ్

Road Accident

Road Accident

అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా కొంతమంది వారి వికృత చేష్టలను మానుకోవడం లేదు. తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా రోడ్డుపై నడిచే ఇతరుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు. అయితే ఇటలీలో మద్యం మత్తులో కారు నడుపుతూ 17 ఏళ్ల బాలుడిని ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

EC: అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం

మృతుడు డేవిడ్ గా గుర్తించారు. యువకుడు డేవిడ్‌ బైక్ పై వెళుతుండగా.. ఓ పోలీసు అధికారి కారు అతనిని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా రోడ్డుపైనే తీవ్ర రక్తస్రావం అయింది. ఆ తర్వాత డేవిడ్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ అధికారిని గృహనిర్బంధంలో ఉంచారు. ఈ ఘటన 2022 మే 8వ తేదీన జరిగింది. అయితే.. ఈ ప్రమాదంపై డేవిడ్ తల్లిదండ్రులు ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు.

Sanya Malhotra : క్లివేజ్ అందాలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ..

డేవిడ్ కు ప్రమాదం జరిగిన చోట ఫుట్‌పాత్‌పై చాలా రక్తం పడి ఉందని డేవిడ్ తల్లిదండ్రులు చెప్పారు. అయితే బ్లడ్ క్లీనింగ్ కోసం అతనికి రూ. 16,200 (£157) బిల్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు పొరపాటున బిల్లును తమకు పంపారు. ఇది ఒక రకమైన జోక్ కావచ్చు అని మొదట భావించారు. కానీ అది జోక్ కాదు. ఈ బిల్లు డేవిడ్ రక్తాన్ని శుభ్రపరిచే ఖర్చుగా వారికి పంపించారు. స్కూటర్ శిథిలాలు, డేవిడ్ రక్తాన్ని క్లీన్ చేయాలంటే త్వరగా డబ్బులు చెల్లించాలని.. లేకుంటే జరిమానా మరింత పెంచుతామని హెచ్చరించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఇది చాలా షాకింగ్ ఘటన. ఓ పక్క కొడుకును కోల్పాయమన్న బాధతో ఉంటే.. ఇప్పుడు రక్తాన్ని శుభ్రపరచడం కోసం ఇలా బిల్లు పంపించడమేంటని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.