NTV Telugu Site icon

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు అలర్ట్..యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎమ్ఎస్ లు బంద్..!

New Project (18)

New Project (18)

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్ సీ (HDFC) కస్టమర్ల కోసం ఒక ముఖ్యమైన అప్‌డేట్ జారీ చేసింది. రేపటి (జూన్ 25) నుంచి, బ్యాంక్ తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలకు సంబంధించి కస్టమర్‌లకు ఎస్ఎమ్ఎస్ (SMS) హెచ్చరికలను పంపడాన్ని నిలిపివేస్తోంది. రేపటి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్‌లు ఎవరికైనా యూపీఐ ద్వారా రూ.100 కంటే తక్కువ పంపితే డబ్బు టెక్స్ట్ సందేశాలు పంపదు. దీనితో పాటు, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు వారి ఖాతాలో మొత్తం రూ. 500 కంటే తక్కువ ఉన్నప్పటికీ టెక్స్ట్ సందేశాలు రావు. అయితే, ఖాతాలో చేసిన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కస్టమర్‌లు ఇమెయిల్ ద్వారా స్వీకరిస్తూనే ఉంటారు.

READ MORE: Tollywood Producers: స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరంకు టాలీవుడ్ బడా నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

బ్యాంక్ కస్టమర్లు వెంటనే ఇమెయిల్ సంబంధిత పనిని చేయవలసి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాకు వారి ఇమెయిల్ ఐడీని లింక్ చేసిన బ్యాంక్ కస్టమర్‌లు లావాదేవీలకు సంబంధించిన ఇమెయిల్ హెచ్చరికలను స్వీకరిస్తారు. యూపీఐ (UPI) లావాదేవీ హెచ్చరికల కోసం బ్యాంక్ కస్టమర్‌లు ఇమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయవచ్చు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

READ MORE:TG Inter Supply Results: ఇవాళ టీజీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..

ఇమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయండిలా..
ముందుగా మీరు www.hdfc.comని సందర్శించాలి.
బ్యాంక్ వెబ్‌సైట్‌లోని ఇన్‌స్టా సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయాలి.
మెనుని క్రిందికి స్క్రోల్ చేయాలి.. అప్‌డేట్ ఇమెయిల్ ఐడీ ఎంపికను కనుగొనాలి.
ఇప్పుడు మీరు లెట్స్ బిగిన్‌పై ట్యాప్ చేయాలి.
ఇప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
DOB, PAN లేదా కస్టమర్ ID ధృవీకరించబడాలి.
మీరు గెట్ OTPని ట్యాప్ చేయాలి.
OTPని నమోదు చేసి తదుపరి సూచనలను అనుసరించాలి.

Show comments