Site icon NTV Telugu

HCA: ఇద్దరు క్రికెటర్లపై హెచ్సీఏ వేటు.. ఐదేళ్ల నిషేధం

Hca

Hca

HCA: ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ సెలక్షన్ లో తప్పుడు పత్రాలు(నకిలీ వయస్సు సర్టిఫికెట్స్) ఇచ్చినట్లు హెచ్సీఏ నిర్ధారించింది. మోసపూరితంగా పత్రాలు రూపొందించి, వాటి సాయంతో టీమ్ కు సెలక్ట్ కావాలని భావించారని హెచ్ సీఏ ఆరోపించింది. అంతేకాకుండా ఆ ఇద్దరి క్రికెటర్లపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు.

Read Also: Dhanraj: డైరెక్టర్ అవుతున్న మరో జబర్దస్త్ కమెడియన్?

ఈ అంశంపై హైదరాబాద్ క్రికెట్ సంఘం సీఈవో సునీల్ కాంటే స్పందించారు. తమ విచారణలో సదరు ఆటగాళ్లు దోషులని నిర్ధారణ అయిందని, దాంతో వారిని జట్ల నుంచి తొలగించామని తెలిపారు. ఈ నకిలీ సర్టిఫికెట్లను ఎక్కడ తయారుచేశారో పోలీసులు కనుగొంటారని సునీల్ కాంటే ఆశాభావం వ్యక్తం చేశారు.హెచ్ సీఏ నియమనిబంధనల పట్ల క్రికెట్ క్లబ్బులు, కోచింగ్ అకాడమీలు ఆటగాళ్లకు అవగాహన కల్పించాలని సూచించారు. మెరుగైన క్రికెట్ వ్యవస్థ కోసం తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

Read Also: Rainy Season : అధిక వర్షాల నుంచి పండ్ల తోటలను ఎలా కాపాడాలి?

Exit mobile version