Plane Crash: సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaneohe Bay Plane Crash: అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నిఘా విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి.. సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం హవాయిలో చోటుచేసుకొంది. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మిది మంది సిబ్బంది ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సముద్రంలో బోటింగ్ చేస్తున్నవారు విమానం నీటిపై తేలడం చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హవాయి న్యూస్ నౌ ప్రకారం.. బోయింగ్ P-8 పోసిడాన్ లాగా కనిపించే భారీ నిఘా విమానం హవాయిలోని కనోహే బే నీటిలో తేలుతూ కనిపించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రన్‌వే నుంచి అదుపుతప్పిన విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనకు కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. అయితే విమానం నీటిలోకి దూసుకెళ్లినా ఎలాంటి డామేజ్ కాలేదట. ఈ ప్రమాద విషయాన్ని మెరైన్ కోర్ బేస్ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్ ధ్రువీకరించారు.
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
Also Read: David Warner: భారత అభిమానులు క్షమించండి.. డేవిడ్ వార్నర్ ట్వీట్ వైరల్!
అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్ విమానం కీలక పాత్ర పోషిస్తోంది. సాధారణంగా వీటిని జలాంతర్గాముల కోసం వేటాడేందుకు ఉపయోగిస్తారు. ఇది సబ్మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయడమే కాకూండా.. భారీగా ఇంటెలిజెన్స్‌ను కూడా సేకరించగలదు. టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను కూడా ఇది తీసుకెళ్లగలదు. ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్ స్క్వాడ్రన్.. కనోహె బే కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచంలో పీ8 విమానాలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, నార్వే, భారత్ సైన్యాలు వాడుతున్నాయి.
🇺🇸 US Navy plane overshoots runway and ends up in a bay in Hawaii
The P-8A “Poseidon” overshot the runway at a Marine base on Kaneohe Bay, said U.S. Marine Corps Spox Gunnery Sgt. Orlando Perez said that all nine people on board the aircraft made it safely to shore@DlugajJuly pic.twitter.com/ltXxVgpvCU
— Velerie (@velerie_a) November 21, 2023
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!