హర్యానాలో బీజేపీ ఎంపీలకు ఇటీవల తరచూ రైతుల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మాజీ ఎంపీ మనీష్ గ్రోవర్‌ను రైతులు 8 గంటల పాటు నిర్బంధించారు. దీంతో బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ నేతను ఎవరైనా అడ్డుకుంటే వారి కళ్లు పీకేస్తా.. చేతులు నరికేస్తా అంటూ హెచ్చరించారు. బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: డీజిల్ ధర విషయంలో అగ్రస్థానంలో తెలుగు రాష్ట్రం
కాగా హర్యానాలోని కిలోయ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆలయంలో ఈనెల 5న మాజీ మంత్రి మనీష్ గ్రోవర్‌ను రైతులు నిర్బంధించారు. ప్రధాని మోదీ కేదార్‌నాథ్ పర్యటన లైవ్‌ను వీక్షించేందుకు ఆలయంలో ఏర్పాట్లు చేయగా.. మనీష్ గ్రోవర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని మనీష్ గ్రోవర్‌ను నిర్బంధించారు. గతంలో రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయన్ను అడ్డుకున్నట్లు రైతు సంఘాల నేతలు వివరించారు.