Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో విదర్భ యువ స్పిన్నర్ హర్ష్ దూబే అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించాడు. ప్రత్యర్థి జట్టుపై ఏకంగా 9 వికెట్లు (9/53) పడగొట్టి అజేయ రికార్డును తన పేరున రాసుకున్నాడు. విదర్భ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 1967 నుంచి అరుణ్ ఓగిరాల్ పేరిట ఉండేది. సరిగ్గా 59 ఏళ్ల నాటి ఈ పాత రికార్డును హర్ష్ దూబే బద్దలు కొట్టడం విశేషం. మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన దూబే.. ఒకే రోజులో తొమ్మిది వికెట్లు తీయడం ఎప్పుడూ ఊహించలేదని, దీనికోసం ఇదంతా సాధ్యం కావడానికి పిచ్ సహకారం కూడా తోడైందని ఆనందం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై తన స్పిన్‌తో పాటు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఎంపీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఔట్ చేయడానికి వేగంలో మార్పులు చేస్తూ వ్యూహాత్మకంగా దెబ్బతీశానని తెలిపాడు. చిన్ననాటి నుంచి తనకు మంచి పరిచయం ఉన్న శుభమ్ శర్మ వికెట్ తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. కేవలం దేశవాళీలోనే కాకుండా ఇటీవలే అఫ్గానిస్తాన్‌పై జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన అనుభవం తనకు ఉందని, ఐపీఎల్, శ్రీలంక పర్యటనలో నెట్ బౌలర్‌గా చేసిన అనుభవాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని తెలిపాడు.
Also Read
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
- November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
- WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
- Sarfaraz Khan: విదేశాల్లోనూ పరుగులు చేశా.. అయినా నాపై చిన్నచూపేనా..?
భారత్‌లో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తనకు అవకాశం వస్తుందనే దానిపై స్పందిస్తూ.. ప్రస్తుతం దాని గురించి ఎక్కువగా ఆలోచించి అనవసరమైన ఒత్తిడి పెంచుకోనని చెప్పాడు. తన చేతిలో ఉన్న ప్రాక్టీస్, కష్టపడే తత్వానికే ప్రాధాన్యత ఇస్తానని, రాతలో ఉంటే ఆ అవకాశం ఎప్పటికైనా దక్కుతుందని పేర్కొన్నాడు. హర్ష్ దూబే సాధించిన ఈ అరుదైన ఘనతతో భారత క్రికెట్ సర్కిళ్లలో ఇప్పుడు ఈ యువ స్పిన్నర్ పేరు గట్టిగా వినిపిస్తోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
-
November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Sarfaraz Khan: విదేశాల్లోనూ పరుగులు చేశా.. అయినా నాపై చిన్నచూపేనా..?
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!