Sarfaraz Khan: విదేశాల్లోనూ పరుగులు చేశా.. అయినా నాపై చిన్నచూపేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarfaraz Khan: టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత్-A జట్టును ప్రకటించగా.. అందులో తనకు చోటు దక్కకపోవడంపై తాజాగా స్పందించాడు. జట్టు ఎంపిక జరిగిన ప్రతిసారీ తనకు ఆశలు ఉంటాయని.. అయితే, తుది నిర్ణయం సెలెక్టర్ల చేతుల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన పని క్రికెట్ ఆడటమేనని స్పష్టం చేశాడు.
తనను భారత పరిస్థితుల్లో ఆడటానికి మాత్రమే పరిగణిస్తున్నారనే విషయం డ్రెస్సింగ్ రూమ్‌లో తెలిసిందని సర్ఫరాజ్ తెలిపాడు. అయితే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లోనూ భారత్-A తరఫున పరుగులు సాధించానని గుర్తుచేశాడు. విదేశాల్లో కూడా తనకు మంచి రికార్డు ఉందన్నాడు. భారత్-A తరఫున విదేశాల్లో ఆడిన ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 50 సగటుతో 300 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 1, 154, 40, 55 పరుగులు చేశాడు. తండ్రి ప్రోత్సాహమే తనకు ప్రతిరోజూ క్రికెట్ ఆడేందుకు స్ఫూర్తినిస్తోందని చెప్పాడు. ఉదయం 5 గంటలకే ప్రాక్టీస్‌కు వెళ్లడం తన దినచర్యలో భాగమని వెల్లడించాడు.
Also Read
- Hyundai Creta 2027: క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న నెక్స్ట్-జెన్ క్రెటా.. ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
- Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
- Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
ఇక టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకోవాలనే లక్ష్యంతో గతేడాది కఠినమైన డైట్, వ్యాయామం ద్వారా ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడు. 97 కిలోల నుంచి 77 కిలోలకు చేరుకున్నాడు. ఎవరూ ప్రత్యేకంగా బరువు తగ్గమని చెప్పకపోయినా.. తనలో మార్పు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. భారత్, భారత్-A, రంజీ, ఐపీఎల్.. ఎక్కడ అవకాశం వచ్చినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని సర్ఫరాజ్ స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Sarfaraz Khan: విదేశాల్లోనూ పరుగులు చేశా.. అయినా నాపై చిన్నచూపేనా..?
-
Hyundai Creta 2027: క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. అదరగొడుతున్న నెక్స్ట్-జెన్ క్రెటా.. ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
-
Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
-
Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!