Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harmanpreet Kaur: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించింది. జోహన్నెస్ బర్గ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 38 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించింది. ఆమెతో పాటు ఓపెనర్ షఫాలి వర్మ 64 పరుగులు చేయగా, స్మృతి మంధానా 37 పరుగులతో సహకరించింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో సాధించిన అర్ధసెంచరీతో హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన మహిళా కెప్టెన్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు 3016 పరుగులతో చమరి అథపత్తు పేరిట ఉండగా, ఇప్పుడు హర్మన్‌ప్రీత్ 3017 పరుగులతో ఆమెను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మెగ్ లానింగ్ 2619 పరుగులతో మూడో స్థానంలో ఉంది.
Also Read
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ఇచ్చిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు సునాయాసంగా విజయం సాధించింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్భుత బ్యాటింగ్‌తో 115 పరుగులు చేసి భారత్ బౌలర్లపై దండయాత్ర చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 3-0తో సిరీస్ ను కోల్పోయింది. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్‌లో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, బౌలింగ్ విభాగం మాత్రం నిరాశపరుస్తోంది.
ముఖ్యంగా ప్రధాన బౌలర్ రేణుక సింగ్ ఠాకూర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. అలాగే దీప్తి శర్మ కూడా ఎక్కువ పరుగులు ఇస్తోంది. అయితే యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ మాత్రం సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!