ABHB: ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.21 వేలు ప్రకటించిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ABHB: ప్రభుత్వం పేద కుటుంబాల్లో జన్మించే ఆడపిల్లల సంరక్షణకు అనేక ప్రభుత్వ పథకాలను తీసుకొస్తుంది. దీని కింద ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పుడు 21 వేల రూపాయలు ఇస్తుంది. ఈ పథకం ప్రయోజనాన్ని ఎవరు పొందవచ్చో తెలుసుకుందాం… ఈ పథకం హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది 2015లో ప్రారంభించబడింది. ఈ పథకం పేరు ‘ఆప్కీ బేటీ, హమారీ బేటీ యోజన’. ఈ పథకం లక్ష్యం భ్రూణహత్యలను నిరోధించడం, అమ్మాయి..అబ్బాయి మధ్య నిష్పత్తిని తగ్గించడం. హర్యానా ప్రభుత్వం ఆప్కీ బేటీ హమారీ బేటీ యోజన రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది.
మీరు ఈ మొత్తాన్ని ఎప్పుడు పొందుతారు
హర్యానా ప్రభుత్వం ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులం లేదా BPL కుటుంబాల్లోని మొదటి ఆడపిల్ల.. ఏదైనా కులానికి చెందిన రెండవ ఆడపిల్ల కోసం LICలో రూ.21000 పెట్టుబడి పెట్టబడుతుంది. కుమార్తెకు 18 ఏళ్లు నిండినప్పుడు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
Also Read
- Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
- OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
- AP HRC: "నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి".. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
- AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
Read Also:Godavari River: ధవళేశ్వరం వద్ద గోదావరి మహోగ్ర రూపం.. మూడో హెచ్చరిక దిశగా పరుగులు
ఎవరు ప్రయోజనం పొందవచ్చు
షెడ్యూల్డ్ కులాలు, BPL కుటుంబాలు హర్యానా ప్రభుత్వం నుండి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. హర్యానా నివాసితులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందగలరు. ఈ పథకం కింద జనవరి 22, 2015 తర్వాత పుట్టిన ఆడపిల్లలు ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావాలని, ఆడపిల్లల నిష్పత్తిని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
– మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. అధికారిక వెబ్సైట్ wcdhry.gov.inని సందర్శించాలి.
– ఇప్పుడు స్కీమ్ ఆప్షన్లో స్కీమ్స్ ఫర్ చిల్డ్రన్ పై క్లిక్ చేయండి.
– దీని తర్వాత మీరు ABHB (Apki Beti Hamari Beti)పై క్లిక్ చేయాలి.
– ఇప్పుడు అన్ని పత్రాలను జతచేసి, డౌన్లోడ్ చేసిన ఫారమ్‌ను అంగన్వాడీ కేంద్రంలో సమర్పించాలి.
– ధృవీకరణ తర్వాత మీకు పథకం ప్రయోజనం ఇవ్వబడుతుంది.
Read Also:Hyderabad: హైదరాబాద్‌లో విషాదం..నిముషాల వ్యవధిలోనే మూడు ప్రమాదాలు,5 మంది మృతి..
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!