NTV Telugu Site icon

Haish Rao: సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు..

Mla Harish Rao

Mla Harish Rao

సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతల బృందం కూడా ఉంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీ తేజ్‌ను పార్టీ అధినేత కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని తెలిపారు. శ్రీ తేజ్ కోలుకుంటున్నాడు.. వైద్యానికి శ్రీతేజ్ స్పందిస్తున్నారని అన్నారు. శ్రీ తేజ్‌కు స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారన్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామని హరీష్ రావు తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన రేవతికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాను మరణిస్తున్నా.. కొడుకు శ్రీ తేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశామని చెప్పారు. రేవతి అందరి మనసును కరిగేలా చేసిందని హరీష్ రావు తెలిపారు.

Read Also: China: 6వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్‌ని రూపొందించిన చైనా..?

ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి అని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారని హరీష్ రావు అన్నారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. గురుకులాల పిల్లల మాతృమూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించరు అని అన్నారు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. కొండారెడ్డి పల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అన్నారు. సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా పిలవరా..? అని విమర్శించారు. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసని హరీష్ రావు పేర్కొన్నారు.

Read Also: YS Jagan Praja Darbar in Pulivendula: పులివెందులలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌.. పోటెత్తిన జనం

Show comments