China: చైనా తన అమ్ములపొదిలో కొత్తగా రూపొందించిన స్టెల్త్ ఫైటర్ జెట్‌ని తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 6వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్‌ని ఆవిష్కరించినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కనిపించాయి. ఇది పెద్ద టెయిల్ లెస్ ఫైటర్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ అని భావిస్తున్నారు. దీని అసాధారణమైన డిజన్ కారణంగా ఇది సంప్రదాయ రాడార్‌లను ఉపయోగించి గుర్తించడం అసాధ్యం. ఒక వేళ ఇదే నిజమైతే ఈ చైనీస్ స్టెల్త్ ఫైటర్ జెట్ భారత సరిహద్దుల్లో ముప్పుగా మారొచ్చు. భారత్ వద్ద ఇప్పటి వరకు స్టెల్త్ ఫైటర్ జెట్లు లేవు.
Read Also: CRIME: గర్భం దాల్చడం లేదని భర్త బెదిరింపులు.. గొడ్డలితో నరికి చంపిన భార్య..
ఇప్పటికే చైనా రెండు 5 th జనరేషన్ ఫైటర్ జెట్లను కలిగి ఉంది. జే-20 స్టెల్త్ ఫైటర్ జెట్‌లను సిక్కిం సరిహద్దు నుంచి 150 కి.మీ దూరంలో చైనా మోహరించింది. భారత్ వద్ద ప్రస్తుతం ఫ్రెంచ్ తయారీ రాఫెల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇవి జే-20ని ఎదుర్కొంటాయి. చైనా వద్ద జే-35 ఏ అనే అత్యాధునిక 5వ తరం ఫైటర్ జెట్ కూడా ఉంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాల వద్ద మాత్రమే స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి.