Site icon NTV Telugu

Harish Rao: ఒకప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు వచ్చేవి.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది!

Harish Rao

Harish Rao

Harish Rao Compares Telangana land prices and Ap land prices: ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పదేకరాల భూమి వచ్చేదని.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఏపీలో ఎకరా అమ్మితే ఇప్పుడు తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక మన దగ్గర ఇలాంటి పరిస్థితి వచ్చిందనిమండిపడ్డారు. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ పార్టీ పగపట్టిందని హరీష్ రావు పేరొన్నారు. ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

‘కాంగ్రెస్ 20 నెలల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వీయ అనుభవం చెందారు. రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు కానీ 2 లక్షల పెన్షన్లు తీసేశారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం చెప్పులు క్యూలైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ హయాంలో నాట్లకు, నాట్లకు రైతు బంధు వచ్చేది. రేవంత్ రెడ్డి హయాంలో ఓట్లకు, ఓట్లకు మధ్య రైతు భరోసా వస్తుంది. కాంగ్రెస్ వచ్చాక బోరు బావుల మోటర్ల మెకానిక్లు మాత్రమే బాగుపడ్డారు’ అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

Also Read: IND vs ENG 4th Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ!

‘ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో పదేకరాల భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఏపీలో ఎకరా అమ్మితే తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుంది. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. గజ్వేల్ లో కాంగ్రెస్ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు. గజ్వేల్‌లో అన్ని మండలాల్లో గులాబీ జెండా ఎగరాలి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గజ్వేల్. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ పార్టీ పగపట్టింది. నాయకులు ఎవరు గ్రూపుల జోలికి పోవొద్దు. రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎవరు పోటీలో ఉంటారనేది చర్చించి నిర్ణయం తీసుకుందాం’ అని ఎమ్మెల్యే హరీష్ రావు నేతలకు సూచించారు.

Exit mobile version