NTV Telugu Site icon

Harish Rao: కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు.. మిగతా బ్యారేజీలు చూడాలి..

Harish Rao

Harish Rao

శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీరు మాట్లాడి, మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు.. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదు.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలో మీటర్ల సొరంగాలు, 1531 కిలో మీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగి కలిసిన సమూహమే కాళేశ్వరం అని ఆయన పేర్కొన్నారు. ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగి పోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు అంటూ హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Uttam Kumar Reddy: తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం..

మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండి అంటూ హరీశ్ రావు సూచించారు. కాళేశ్వరం ఫలితాలు రైతును అడగండి.. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి రంగనాయక సాగర్ చూశారు.. అద్బుతం అని మెచ్చుకున్నారు.. చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు వస్తాయని ఆయన అన్నారు. కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదు అని ప్రశ్నించారు. మేము నీళ్ళు లేని నుంచి నీళ్ళు ఉన్న దగ్గరకు మార్చి ప్రాజెక్టు కట్టి నీళ్ళు అందించామన్నారు. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ఆ జలాల వల్లే.. తప్పు జరిగితే చర్య తీసుకోండి.. తిరిగి పునరుద్దరణ పనులు చేయండి అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Read Also: Anil Kumar Yadav: ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా జగన్‌ను అభిమానించేవారు కాదు..!

రాష్ట్రంలో దురుద్దేశంతో ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయడం లేదు అని హరీశ్ రావు అన్నారు. అద్భుతంగా నిర్మించి నీల్లు ఇస్తున్నాం.. రైతులను ఇబ్బంది పెట్టకండి.. నష్ట పోతారు.. మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ప్లై ఓవర్ కూలి 20 మంది చనిపోయారు.. దేవాదుల పైపులు పేలి నీళ్ళు ఆకాశమంత ఎగిరాయి.. అలాంటి ఘటనలు జరగటం బాధాకరం. కానీ ముందుకు వెళ్ళాం కదా అని ఆయన అన్నారు. ప్రాజెక్టులు అప్పగించొద్దని మేము నిద్ర లేపితే లేచారు.. ఈరోజు మా సభ ఉందని మీరు డైవర్ట్ కోసం పోటీ కార్యక్రమం పెట్టారు.. మీ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారు అని హరీశ్ రావు వెల్లడించారు.