NTV Telugu Site icon

Harish Rao : వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు

Harish Rao

Harish Rao

Harish Rao : సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆయన ఆరోపించారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడి వడ్లని 1800 కి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని, మొక్కజొన్న కొనే నాధుడే లేడని హరీష్‌ రావు అన్నారు. వర్షాలకు చాలా చోట్ల తడిశాయి…వాటిని వెంటనే కొనుగోలు చేయాలని, ఒక్క రోజైన ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పి ఉన్న రైతుబంధు కూడా ఇవ్వలేదన్నారు. ఇంకా 22 లక్షల మందికి తెలంగాణలో రుణమాఫీ కాలేదని, రుణమాఫీపై ఎన్నో కొర్రీలు పెట్టి 100 కారణాలు చెబుతున్నారన్నారు హరీష్‌ రావు. రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటారని, లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి సుందరికరణ ఎలా చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్, మంత్రులు ఇప్పటికైనా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకి రావాలని, రైతుల సమస్యల్ని పట్టించుకోని పరిష్కరించాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు హరీష్‌ రావు.

Delhi: ఘోరం.. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్ (వీడియో)

ఇదేకాకుండా..’ఆదిలాబాద్ లో సోయాబీన్ రైతులకు రెండు నెలలైన డబ్బులు ఇవ్వట్లేదు. సిద్దిపేటలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలెక్కువ చేతలు తక్కువ. కరోనా ఉన్న, ఎంత కష్టం వచ్చినా మంత్రుల జీతాలు ఆపారు కానీ రైతుబంధు ఆపలేదు. పత్తి రైతులు ఆగమైపోయారు. గతేడాది కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని కొన్నాడో మీరిప్పుడు ఎన్ని కొన్నారో లెక్కలు చెప్పాలి. ధాన్యంపై కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయకపోతే రోడ్డెకాల్సి వస్తుంది. రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు.’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Bhatti Vikramarka : భవిష్యత్తులో విద్యుత్‌కు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం

Show comments