NTV Telugu Site icon

Harish Rao: ప్రభుత్వం ఏర్పడలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదు..

Harish Rao

Harish Rao

సంగారెడ్డిలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఏర్పడలేదు.. మనం కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు.. వాళ్ళు మనకంటే బాగా చేయాలని కోరుకుందామని తెలిపారు. అధికార పార్టీ వాళ్ళు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేశారు.. ప్రజలు నమ్మారు వాళ్ళకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు.. లేనప్పుడు కుంగిపోలేదని హరీష్ రావు అన్నారు.

Pakistan: పాకిస్తాన్ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి..

బీఆర్ఎస్ అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తామెప్పుడు ప్రజల పక్షమేనని హరీష్ రావు తెలిపారు. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో తాము ఓడిపోయామన్నారు. ఓటమిపై సమీక్ష జరుపుదాం.. తప్పు ఒప్పులు సరి చేసుకుందామని చెప్పారు. రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా.. సంగారెడ్డిలో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరిందని పేర్కొన్నారు. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా.. ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హరీష్ రావు చెప్పారు.

YV Subba Reddy: వైసీపీలో చాలా మార్పులు.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

వచ్చే పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని హరీష్ రావు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణపై కేసీఆర్ కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని తెలిపారు. 14 ఏళ్ళు కష్టపడి, పదవులు గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణ తెచుకున్నామన్నారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది బీఆర్ఎస్సేనని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీల కోసం కొట్లాడుదాం.. భవిష్యత్తు మనకే ఉంటుంది.. కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడొద్దని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.. అందరం కలసి పని చేద్దామని తెలిపారు.