ఒక విజన్ లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచింది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏ చేస్తుందొ గవర్నర్ ప్రసంగంలో ఉండాలన్నారు. ఆసరా పెన్షన్ , మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తామో తెలపనీ ప్రసంగం నిరాశ పరిచింది.. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో తెలపనీ ప్రసంగం నిరాశ పరిచింది.. నిరుద్యోగ భృతి ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదు.. ప్రజావాణీ కార్యక్రమం తుస్సుమంది అని ఆయన మండిపడ్డారు. మంత్రులు, ఐఏఎస్ లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు.. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీ లు అమలు అవ్వడం లేదు.. మహాలక్ష్మీ కింద మూడు గ్యారెంటీలు ఉంటే ఒక్క దానిని మాత్రమే ఇచ్చారు అని హరీశ్ రావు పేర్కొన్నారు.
Read Also: BAC Meeting issue: బీఏసీ సమావేశానికి హరీశ్ రావు.. మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం
ప్రమాణ స్వీకారం రోజే 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అని వాయిదా వేశారు అని హరీశ్ రావు ఆరోపించారు. మార్చ్ 17 కి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న 100 రోజులు ముగుస్తాయి.. 6 గ్యారెంటీలు ఏఏ తేదీల్లో అమలు చేస్తారో ప్రసంగంలో చెప్పలేదు.. త్వరలో ఎన్నికల కోడ్ వస్తుంది , హామీలు ఎలా అమలు చేస్తారు.. హామీలను అమలు చేయలేమని కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది అని ఆయన అన్నారు. ప్రసంగంలో యాదాద్రి 4 వేల మెగావాట్ల పవర్ పాయింట్ ప్రస్తావనే లేదు.. విద్యుత్ సంస్థల అభివృద్ధి ఊసే గవర్నర్ ప్రసంగంలో లేదు.. మా హయాంలో మూసీ నది అభివృద్ధికి STPల నిర్మాణం చేశామన్నారు. మూసీ అభివృద్ధి అంటే మురుగు నీరు చేరకుండా చూడాలి.. 6, 7 తేదీలు దాటినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేవు అని మాజీమంత్రి, హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
