Harish Rao : రుణమాఫీ డబ్బు ప్రతి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు రుణమాఫీపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో… దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్, ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమని అని కొనియాడారు. రుణమాఫీ డబ్బు ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే లక్షలోపు ఋణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యతా క్రమంలో రుణమాఫీ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘ఇప్పటి వరకు 18 లక్షల 79 వేల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. 17 లక్షల 15 వేల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయి. సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదు. వీరికి వెంటనే అందజేయాలి. బ్యాంకు ఖాతాలు పనిచేయక పోవడం, అకౌంట్లను క్లోజ్ చేయడం, అకౌంట్ నంబర్లను మార్చడం, బ్యాంకుల విలీనం అనే నాలుగు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తినట్టు వివరించిన అధికారులు. చర్చించిన అనంతరం మూడు పరిష్కార మార్గాలు గుర్తింపు.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
1) ఆధార్ నంబర్ల సాయంతో రైతు బంధు ఖాతాలను గుర్తించి ఆ ఖాతాల్లో రుణ మాఫీ డబ్బు వేయడం, దీని వల్ల సుమారు మరో లక్ష మందికి రుణ మాఫీ డబ్బు అందుతుంది.
2) ఎన్.పీ.సీ.ఐ సాయంతో బ్యాంకులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించి ప్రభుత్వానికి అందజేయాలి. వారికి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఇలా దాదాపు 50 వేల మందికి మూడు రోజుల్లోగా డబ్బు వేయాలని నిర్ణయం.
3) మిగతా 16వేల మంది వివరాలను కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలిస్తారు. ఆ సమాచారం ఆధారంగా రుణమాఫీ పూర్తి చేస్తారు.
రుణమాఫీ సమస్యల పరిష్కారానికి బ్యాంకులు రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. ఒక అధికారిని నియమించి, వారి ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీని ప్రజలకు తెలియజేయాలి. రైతులు ముందుగా బ్యాంకు స్థాయిలో సంప్రదిస్తారు. అక్కడ పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయి అధికారిని సంప్రదించి, సమస్యను చెప్పుకొనేలా ఏర్పాటు చేయాలి. ఇదే తరహాలో వ్యవసాయ శాఖ తరుపున జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తాం.
రుణ మాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయాలి. పురోగతిపై బ్యాంకుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలి. రుణమాఫీ పొందిన వారిలో ఇప్పటి వరకు 35 శాతం మందికి మ్రాతమే కొత్త రుణాలు మంజూరైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరు నాటికి మొత్తం 18.79 లక్షల మంది రైతులకు పంట రుణాలు రెన్యువల్ పూర్తి కావాలి. ప్రభుత్వం మాఫీ చేసిన రూ.9654 కోట్ల మేర తిరిగి కొత్త లోన్ల రూపంలో రైతులకు చేరాలి. కొత్త రుణాలపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఇతర ్రపజా ్రపతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించాలి.
రుణమాఫీ, పంట రుణాల రెన్యువల్‌పై ఈ నెలాఖరులో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం ఆయా జిల్లాల్లో రుణ మాఫీ అంశంపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు అదేశాలు జారీ చేశారు. రుణ మాఫీ సంబధిత అన్ని సమస్యలు సత్వరం పరిష్కరించి రైతులకు రుణాలు అందేలా చూడాలన్నారు.
- Tags
- V
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!