కేంద్ర ప్రభుత్వం కరెంట్ ప్రైవేటీకరణ చేసి కంపెనీలకు అమ్మి ఉద్యోగాలు ఊడగొడితే సంవత్సరానికి 5000 కోట్లు ఇస్తామన్నారని, బీజేపీ పట్ల విద్యుత్ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన మెదక్‌లో మాట్లాడుతూ.. తెలంగాణకు కేసిఆరే శ్రీరామరక్ష అని, సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు లేదని, ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు లేడు కాబట్టి అని ఆయన వ్యాఖ్యానించారు. పవర్ హాలిడేలు ఇచ్చిన కాంగ్రెస్‌కు శాశ్వతంగా ప్రజలు హాలిడే ప్రకటించారని, విరామం లేకుండా కరెంటు ఇచ్చిన కేసీఆర్ కు విరామం లేకుండా పవర్ ఇచ్చారు ప్రజలు అని ఆయన అన్నారు.
Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
పెంచిన చార్జీలపై పోరాటం చేసిన రైతులపై తూటాలు దించి నలుగురిని బలి తీసుకున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడూ వస్తుందో ఎప్పుడూ తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఫ్యాక్టరీలు పవర్ హాలిడే వారానికి మూడు రోజులు ప్రకటించారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ ను ప్రైవేట్ పరం చేసి చేతులు కాల్చుకుందని విమర్శించారు. చంద్రబాబు పెంచిన విద్యుత్ చార్జీల నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. బిల్లులు కట్టకపోతే స్టార్టర్ వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్ డబ్బాలు ఎత్తుకు పోయారని తెలిపారు.
Minister KTR : రెండు నెలల్లో ఎన్నికలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
