NTV Telugu Site icon

Harish Rao : సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్‌ రావు బహిరంగ లేఖ

Harish Rao

Harish Rao

Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు- నష్టపోతున్న లక్షలాది మంది తెలంగాణ లబ్దిదారులు అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి హరీష్‌ రావు. రేషన్ కార్డులు జారీ చేసే విషయంలో మీ ప్రభుత్వం కోతలు పెడుతూ, పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గమని, అభయహస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేస్తుండటం మోసం చేయడమే అని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం చేయకుండా, అర్హులైన వారికి ఎగనామం పెట్టే విధంగా ఉన్న నిబంధనలను, మీ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు.

Bhatti Vikramarka : మేము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టాం

ద్రవ్యోల్బణం అనుసరించి, ఆదాయ పరిమితి పెంచాలన్నారు. కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్దిదారుల జాబితా తయారవుతాయని పేర్కొనడం పేద ప్రజల పాలిట శాపంగా మారిందని, ఎంతోమంది ఈ సర్వేలో పాల్గొనలేదు. పాల్గొన్న వారిలో చాలా మంది వ్యక్తిగత, వృత్తిపరమైన, తదితర వివరాలను పంచుకోవడానికి ఇష్టపడలేదన్నారు. మంత్రులు సైతం కుల గణన సర్వేతో ప్రభుత్వ పథకాలకు ఎలాంటి లంకె ఉండదని స్పష్టం చేసారని, అటువంటి సందర్భంలో కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడం యావత్ తెలంగాణ ప్రజలను వంచించడమే అవుతుందన్నారు హరీష్‌ రావు.

Rahul Gandhi: “కులగణన”తో మోసం.. నితీష్‌ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ