NTV Telugu Site icon

Harish Rao : అత్యంత ప్రతష్టాత్మకంగా వరంగల్‌లో హెల్త్ సిటీ

Harish Rao

Harish Rao

వరంగల్ జిల్లాలో నేడు పర్యటిస్తున్న మంత్రి హరీష్ రావు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యంత ప్రతిష్టాత్మకంగా వరంగల్‌లో హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. 2000పడకల ఆసుపత్రి అతి వేగంగా నిర్మాణం చేపడుతున్నామని, దసరా వరకూ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రూ.1100 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం 2023 చివరి కల్లా పూర్తవుతుందని చెప్పారు. అయితే ఆస్పత్రి నిర్మాణంపై కొందరు నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని.. హాస్పిటల్ అందుబాటులోకి వచ్చాక విమర్శించిన నోళ్లు మూతబడుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయని.. కానీ ప్రాజెక్ట్ పూర్తయ్యాక వాళ్లే నోరెళ్లబెట్టారని అన్నారు మంత్రి హరీష్‌ రావు. మార్చి కల్ల 14లక్షాల అడుగులు పూర్తి చేస్తామని, మొత్తం 16 లక్షాల ఎస్‌ఎఫ్‌ఫ్టీ ఉందని, దేశంలో పెద్ద ఆసుపత్రి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు.

Also Read : Anurag Thakur: ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ను తరిమికొడదాం.. కేంద్రమంత్రి ప్రతిజ్ఞ

వరంగల్‌లో హెల్త్ యూనిర్సిటీ ఏర్పాటు, మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు, కొత్తగా వస్తున్న రోగులకు, జనాభా సరిపడా వైద్య సదపాయాలు.. రెండు పంటలకు నీరు అందిస్తున్నాం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యమన్నారు. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయం త్వరలో ఈ హస్పిటల్‌ పనులు పూర్తి చేయాలన్నారు. మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని, 33జిల్లాల్లో 33 వైద్య కళాశాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read : Heavy Rains : న్యూజిలాండ్‎ను ముంచెత్తిన వర్షాలు.. విమాన సర్వీసులు రద్దు

ఎంబీబీఎస్ పీసీ సీట్లు పెంచడమే లక్ష్యమని, పేదలకు వైద్యం, పేద విద్యార్థులకు సీట్లు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుండి పోదామా బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే విధంగా చేశామన్నారు హరీష్‌ రావు. వివిధ రాష్ట్రాల్లో కంటి వెలుగు కార్యక్రమం ఆదర్శంగా నిలిచిందని, ప్రజల వద్దకు ప్రభుత్యం వెళ్తుందని, కిడ్నీ, హర్ట్ మార్పిడి సౌకర్యం ఈ హాస్పిటల్ లో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దసరా అందుబాటులోకి రావాలని ఏజెన్సీ అధికారులను ఆదేశించారు.