నాంపల్లి లో ఎక్సిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభం అయిన నుమాయిష్ నాంపల్లిలో ఆలిండియా ఎగ్జిబిషన్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల ఉత్పత్తులు, స్టాల్స్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇంట్లో కూర్చొని వస్తువులను ఆర్డ్ చేస్తున్నారన్నారు. మొబైల్‌లో ఆర్డ్‌ర్ ఇస్తే వస్తువులు వస్తాయేమో గానీ.. నుమాయిష్‌లో పొందే అనుభూతిని ప్రజలు కొల్పోతారన్నారు. ఈ ఎగ్జిబిషన్‌కు వస్తే వివిధ రాష్ట్రాల సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, ఉత్పత్తులు ఎంచుకోవచ్చన్నారు. ఎగ్జిబిషన్ను సందర్శించడం తెలంగాణ ప్రజల లైఫ్‌స్టైల్‌లో భాగమని ఆయన అన్నారు.
Also Read : CM Jaganmohan Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం జగన్ నుంచి పిలుపు
ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా చాలా మంది విద్యార్థులు చదువుతున్నారని, గతంలో ఎగ్జిబిషన్ ప్రారంభం అయిన వారం రోజుల వరకు షాప్ లు వచ్చేవి కావని, ఇప్పుడు మొదటి రోజే షాప్ లు ఫుల్ అయ్యాయన్నారు. ప్రజలు ఇక్కడకు రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చేందుకు బస్సుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు మంత్రి హరీష్ రావు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 82 సంవత్సరాల నుంచి నుమాయిష్ నడుస్తుందన్నారు. నుమాయిష్‌తో వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, విద్యా సంస్థలు నడుపడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు మంత్రి తలసాని. ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం విషయంలో చొరవ చూపారని మంత్రి తలసాని తెలిపారు.
Also Read : Chiranjeevi: కొనసాగుతున్న చిరు లీకుల పరంపర… ఈసారి ఏం వదిలాడో చూడండి