NTV Telugu Site icon

Harish Rao : మోడీది పూటకో మాట.. రాష్ట్రానికో మాట చెబుతున్నాడు.

Harish Rao

Harish Rao

ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మక్తల్ సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మోడీ వచ్చి పెద్ద నీతులు చెప్పే ప్రయత్నం చేశాడని, మోడీది పూటకో మాట.. రాష్ట్రానికో మాట చెబుతున్నాడన్నారు. కేసీఆర్ అద్భుతంగా పని చేస్తున్నాడని పార్లమెంట్ లో చెప్పాడని, కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నీళ్లు, ప్రాజెక్టులు, కరెంటు అభివృద్ధి గురించి మాట్లాడుతే… ఏపీ నాయకుడు కేసుల గురించి మాట్లాడతారని పార్లమెంట్ సాక్షిగా చెప్పాడని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఒక మాట, తెలంగాణ గల్లీల్లో ఒక మాట అని హరీష్ రావు విమర్శించారు. నిన్న కాక మొన్న కర్ణాటకలో దేవె గౌడ్ తో పొత్తు పెట్టుకున్నావ్… అక్కడ ఏం చెప్తావ్ అని ఆయన అన్నారు.

Also Read : Mercury: కుచించుకుపోతున్న బుధ గ్రహం.. తగ్గిన వ్యాసార్థం.. కారణం ఇదే..

జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ ఎవరు… సమాధానం చెప్పు అని ఆయన అన్నారు. నామినేటెడ్ గా రాలేదు ప్రజలు లక్ష ఓట్లతో గెలిపిస్తే ప్రజా క్షేత్రం నుంచి వచ్చి పని చేస్తున్నామన్నారు. మీ మాదిరి రాజ్యసభ, మంత్రి పదవులు మాకు కేసీఆర్ ఇవ్వలేదు… ఉద్యమం చెయ్యమని చెప్పాడన్నారు. పోరాటాలు, ఉద్యమాలు, జైలు కు పోయినమని, మీరు నామినేటెడ్ పదవులు ఇచ్చి కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని, ఎన్నికలు వస్తున్నాయని రాజకీయం కోసం మాట్లాడడం చాలా దురదృష్టకరమన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బీ టీం అని ఆయన అన్నారు.

Also Read : CM YS Jagan Delhi Tour: మరోసారి సీఎం జగన్‌ హస్తినబాట.. రెండు రోజులు ఢిల్లీలోనే..!