NTV Telugu Site icon

Harish Rao: ఆరు గ్యారెంటీల అమలు కోసం తీసుకున్న అప్లికేషన్లలు ఏం అయ్యాయి..?

Harishrao

Harishrao

తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఆశిస్తున్న నిరుద్యోగ యువత బీఆర్ఎస్ కు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తమను రెచ్చగొట్టి హామీలు ఇచ్చిందని నిరుద్యోగులు అంటున్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది.. గ్రూప్-1లో 1 : 100 చొప్పున మెయిన్స్ కు అనుమతి ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.. అసెంబ్లీలో నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా భట్టి విక్రమార్క 1 : 100 చొప్పున పిలవాలని డిమాండ్ చేశారు అని గుర్తు చేశారు. ఇవాళ ఎందుకు మాట తప్పుతున్నారు..? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్-2కు రెండు వేల ఉద్యోగాలు.. గ్రూప్-3లో మూడు వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం జోడించి.. పరీక్షలు నిర్వహించాలి అని హరీశ్ రావు అన్నారు.

Read Also: Raviteja 75 : అటవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వస్తున్న రవితేజ..?

ఇక, ఎగ్జామ్ కు ఎగ్జామ్ మధ్య గ్యాప్ ఉండాలి అని గతంలో కాంగ్రెస్ పార్టీ అన్నది.. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మరిచింది కాంగ్రెస్ అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల గ్యాప్ తో పరీక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మపలికింది.. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఆరు నెలలు అయిన ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం.. వచ్చే ఆరు నెల్లలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.. ఇక, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ను కలిస్తే మా చేతుల్లో లేదని నిరుద్యోగులకు చెబుతున్నారట.. కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోదండరామ్ బాధ్యత తీసుకోవాలి అని మాజీ మంత్రి తెలిపారు.

Read Also: Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో మరణించిన నక్సలైట్లలో ఆరుగురిపై రూ.48లక్షల రివార్డ్

అలాగే, ఆరు నెలలు అయిన కొత్తగా పెన్షన్ లు ఇవ్వడం లేదు అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరు గ్యారెంటీ ల అమలు కోసం తీసుకున్న అప్లికేషన్లలు ఏం అయ్యాయని ప్రశ్నించారు. ఏపీలో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం పెంచిన పెన్షన్ పై సీఎం సంతకం పెట్టారు.. మరి ఆరు నెలలు అయిన కాంగ్రెస్ సర్కార్ పెంచిన పెన్షన్ లు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. దివ్యంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామన్నారు.. ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే, ఆశ వర్కర్లకు వేతనాలు ఒకటవ తేదీన అందడం లేదు.. NHMలకు రెండు నెలలు అయిన ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల వర్కర్లకు జీతాలు అందడం లేదని ధర్నాలు చేస్తున్నారు అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

Read Also: Akhanda 2 : అఖండ 2 కోసం బోయపాటి భారీ ప్లాన్..?

ఇక, గ్రామ పంచాయతీలకు నిధులు రావడం లేదు అని హరీశ్ రావు అన్నారు. అయిదు నెలల నుంచి సఫాయి కార్మికులకు జీతాలు అందడం లేదు.. గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆరు నెలలు అవుతుంది.. CMRFలు ఇవ్వడం లేదు.. రూ. 65 వేల చెక్కులు రెడీగా ఉన్న.. వాటిపై కేసీఆర్ కెఫోటో ఉన్నదని ఇవ్వకుండా అపారు.. CMRF అప్లికేషన్ లు వెంటనే ప్రాసెస్ చేయాలి.. అంగన్ వాడి టీచర్లకు రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు.. మళ్ళీ ఆంగన్ వాడిలకు జీతాలు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అనే విషయాన్ని కూడా హరీశ్ రావు డిమాండ్ చేశారు.