NTV Telugu Site icon

Harish Rao : నేను ఇప్పటికీ రాజీనామాకి కట్టుబడి ఉన్నా..

Harish Rao

Harish Rao

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లు కాదు.. చీట్ చాట్ లు అని, చిట్ చాట్ రికార్డ్ ఉండదు కాబట్టి, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నాడని, నేను ఇప్పటి కి రాజీనామా కి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని, రుణమాఫీ పాక్షికంగా మాత్రమే అయింది అని ఉత్తమ్ కుమార్ చెప్పారని ఆయన వెల్లడించారు. మీ మంత్రులు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు అని చెబుతున్నారని, నా ఛాలెంజ్ పంద్రాగస్టు లోగా రుణమాఫీ చేయాలని చేసానన్నారు. కానీ రుణమాఫీ పూర్తిగా జరగలేదు అనేది వాస్తవమని ఆయన వ్యాఖ్యానించారు. వాల్మీకి స్కాం పట్టపగలు నిలువు దోపిడీ అని, ప్రభుత్వ డబ్బులు గోల్డ్ షాపు లు, కార్ల కంపెనీలకు వచ్చాయన్నారు. ఈ స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారని, ఈ కుంభకోణం పై విచారణ చేయాలని ఈడీ ని అడుగుదామన్నారు హరీష్‌ రావు.

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఇకపై అదనపు లడ్డూలు కావాలంటే?

అంతేకాకుండా..’ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ కి ఉందా. బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదు. బడే బాయ్ చోటా బాయ్ కాబట్టే తెలంగాణ లో విచారణ చేయట్లేదు. రాహుల్ గాంధీ వాల్మీకి స్కాం మీద మాట్లాడట్లేదు. బీజేపీ కూడా వాల్మీకి స్కాం పైన మాట్లాడట్లేదు. బీఆర్‌స్‌ పార్టీ గా ఈడీ ని కలిసి విచారణ చేయాలని కోరుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం గా మారింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గిపోయింది. బుద్ధ భవన్ లో ఉన్న హైడ్రా ఆఫీసు నాలా మీదనే ఉంది. జీహెచ్‌ఎంసీ ఆఫీసు కూడా నాలా మీదనే ఉంది. ముందు హైడ్రా ఆఫీసు, ghmc ఆఫీసు ని కూలగొట్టండి. నెక్లెస్ రోడ్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లు, రెస్టారెంట్ లు, i max లని ముందు కూలగొట్టండి. నోటీసు లతో పాటు పరిహారం కూడా ఇవ్వండి. కమీషన్ కాకతీయ అంటున్న ముఖ్యమంత్రి… విచారణ జరిపించండి. తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన చేస్తే ఒక్క మంత్రి మాత్రమే వచ్చారు. న్యాయస్థానం గురించి తప్పు గా మాట్లాడడం తప్పు.. ఓటు కు నోటు కేసు లో బెయిల్ వచ్చినప్పుడు మీకు టీడీపీ బీజేపీ పొత్తు వల్లనే అని మేము అనొచ్చు. కానీ సంస్కారం ఉంది కాబట్టి అనట్లేదు. న్యాయం గెలిచింది కాబట్టి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బండి సంజయ్ కూడా కోర్టు ల పట్ల అలా మాట్లాడ కూడదు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు కూడా స్వాగతించారు.. మీరు మాత్రం వక్రీకరించి మాట్లాడు తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈరోజు మొట్టికాయలు వేసింది. ఫోర్త్ సిటీ పేరు తో ఏమి జరుగుతుందో త్వరలో ఆధారాల తో సహా బయట పెడతాను. కందుకూరు లో సర్వే నెంబర్ 9 లో 385 ఎకరాలు ప్రభుత్వ భూమి కొల్లగొడుతున్నారు. తుక్కుగుడా లో 25 ఎకరాలు పేదల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ముచ్చర్ల లో వాళ్ళ తమ్ముళ్ల పీఏ ల పేరు మీద అగ్రిమెంట్ లు జరుగుతున్నాయి.’ అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: త్వరలో భారత్ జోడో యాత్ర!.. రాహుల్ గాంధీ వీడియో వైరల్