సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 16న మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ సభ నిర్వహించే సభ స్థలిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. జనసమీకరణ, ఏర్పాట్లపై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీ తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిన హామీలు గుర్తు వచ్చేలా రైతులు, యువకులు, మహిళలు, గొల్ల కురుమలు రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలన్నారు హరీష్ రావు.
కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు, రైతుబీమా, మిసన్ కాకతీయ వంటి పథకాలు తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడ్డారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి తిరోగమనం దిశగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట ఎండిపోతోంది…రైతులు తమ వరి ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని, రైతు పండించిన పంటకు బోనస్ ఇచ్చేలా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకొస్తాం. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు హరీష్ రావు.
గ్యారెంటీల్లోని హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గ్యారంటీగా ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, పంట బోనస్ ఇచ్చిన తర్వాతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ మెజార్టీ ఎంపీ సీట్లు గెలిస్తే రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడతామని చెప్పారు. బీఆర్ఎస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని ఈ సందర్భంగా హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.