NTV Telugu Site icon

Harish Rao : మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయింది

Harish Rao

Harish Rao

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఆర్టీసీపై చర్చ జరిగింది. దీనిపై వాకౌట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు.. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌ వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందని, రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి ఆయన అన్నారు. ఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదన్నారు. సీఎం హాఫ్ నాలెడ్జీ తో మాట్లాడుతున్నారని, ఆయనకు ఎవరు సలహాలు ఇస్తున్నారో.. నేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశానని ఆయన తెలిపారు. మేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందన్నారు.

Gold Price Today: బడ్జెట్‌ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే రూ.2750 తగ్గిన బంగారం! భారీగా పడిపోయిన వెండి

అంతేకాకుండా..’మేము అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గ్రూప్1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో వున్నప్పుడు భట్టి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. నిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి
కాంగ్రెస్ వస్తే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సిని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.’ అని హరీష్‌ రావు అన్నారు

Agricultural Field : చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైల్లో కుక్కల బెడద