NTV Telugu Site icon

Harish Rao : ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయం

Harish Rao

Harish Rao

హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హుస్నాబాద్ లోని కార్యకర్తల మీద నమ్మకంతో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారు. హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం కేసీఆర్ అన్నారన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బిఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీష్‌ రావు. ఆసత్య సర్వేల పేరిట అధిరంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దాయనియ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు హరీష్‌ రావు.

Also Read : Ganapath trailer: కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిన టైగర్ ష్రాఫ్ గణపధ్ ట్రైలర్

అంతేకాకుండా.. ‘కాంగ్రెసోల్లు ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ, మాటలు, ముఠాలు, మూటలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బిజెపి వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ ఇచ్చిన గొప్ప వరం. ఈ నెల 15న బిఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుంది. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదు. 2004లో తెలంగాణ ఇస్తామని టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీని మింగేయాలని చూసింది. మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బిజెపి వాళ్ళు మంచివాళ్ళ, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడా రైతులు ఆలోచించుకోవాలి.

Also Read : Visakhapatnam: అప్పికొండ బీచ్ యువతి కేసులో మరో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..

కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారు. తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారింది. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయింది. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే తెలంగాణ కింద పడుతుంది. ఈనెల 15న హుస్నాబాద్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు 3 గంటలకు ప్రజలను తీసుకువస్తే, 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారు.’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.