సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా ఇవాళ అన్నారం బ్యారేజీ వద్ద బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుంది అని రేవంత్ ఆలోచన లా కనిపిస్తుందన్నారు. అసలు కేసిఆర్ నే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఆనవాళ్లు లేకుండా చేస్తాం అన్నాడన్నారు. గతంలో ప్రగతి భవన్ ను బాంబుల తో పేలుస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. మేడిగడ్డ వెళ్తాం అనగానే కాగ్ రిపోర్ట్ అని, పాలమూరు విజిట్ అని వెళ్ళారు కాంగ్రెస్ నాయకులు అని, మేము ఈ పర్యటన కు రాగానే ఉత్తమ్ ప్రెస్స్ మీట్ పెట్టీ మేడిగడ్డ రిపేర్ చేపిస్తాం అని చెప్పారన్నారు హరీష్ రావు. అంటే పాక్షికంగా మనం విజయం సాధించామని, ఇన్ని రోజులు బీఆర్ఎస్ పై కుట్రలు చేసింది కాంగ్రెస్ అని ఆయన దుయ్యబట్టారు.
Top Headlines @9PM : టాప్ న్యూస్
అంతేకాకుండా..’రైతుల పక్షాన పని చేయాలని లేదు, ఎంత సేపు మా మీద ఆరోపణలే ఎక్కువ. రాజకీయ ప్రయోజనాలే కాంగ్రెస్ చేస్తోంది. అసత్య ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతోంది. మెగా ప్రాజెక్ట్ కట్టినప్పుడు చిన్న.చిన్న లోపాలు రావటం సహజం. మొత్తం కాళేశ్వరం కూలిపోయింది అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అన్నారం లో ఉన్న ఇబ్బందులు వెంటనే మరమత్తులు చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అబద్ధాలు బాగా నేర్చుకున్నాడు. తమ్మిడిహట్టి వద్ద నీళ్ళు లేవని కేంద్రం cwc చెప్పింది. అక్కడ ప్రాజెక్ట్ కట్టాలని కాంగ్రెస్ ఇప్పుడు చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడకు.’ అని హరీష్ రావు ధ్వజమెత్తారు.
Off The Record : శాసనమండలిలో BRS ఫ్లోర్ లీడర్స్ ఎవరు.. పోటీ పడుతున్న ఆ MLC లు ఎవరు?
