Site icon NTV Telugu

Harish Rao : హైకోర్టులో హరీష్ రావుకు ఊరట.. ఎన్నికల పిటిషన్ కొట్టివేత

Harish Rao

Harish Rao

Harish Rao : తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల్లో అర్హతలపై, సమాచారంలో తేడాలు ఉన్నాయని పేర్కొంటూ చక్రధర్ గౌడ్ అనే అభ్యర్థి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌లో, నామినేషన్ దాఖలు సమయంలో హరీష్ రావు తమ ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని, ఈ విషయంలో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని ఆరోపించారు.

Sonam Raghuwanshi: పెళ్లైన 4 రోజులకే పుట్టింటికి వచ్చిన సోనమ్.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, అభ్యర్థి చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అందువల్ల, ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. హరీష్ రావు తరఫున ఈ కేసులో వాదనలు వినిపించిన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు, పిటిషన్‌ అసాధారణంగానే కాకుండా, దానిలో ఎలాంటి ఆధారాలు లేకపోవని న్యాయస్థానానికి వివరించారు. హైకోర్టు తీర్పుతో హరీష్ రావు శిబిరంలో ఆనందం వ్యక్తమవుతోంది.

Cyber Fraud : సుప్రీంకోర్టు జస్టిస్‌ను కూడా వదలని కేటుగాళ్లు.. నకిలీ కోర్టు సృష్టించి, నకిలీ జడ్జిని పెట్టి..

Exit mobile version