NTV Telugu Site icon

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసింది

Harish Rao

Harish Rao

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ చేశారు హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 86 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అబద్ధాలు మాట్లాడారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిన్న పార్లమెంట్ లో పట్టపగలు ప్రతిపక్ష పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కళ్ళలో కన్నీరు వస్తే… తెలంగాణ ప్రభుత్వం లో త్రాగు, సాగు నీరు వస్తుందన్నారు.

Also Read : Rahul Gandhi: పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగంపై రాహుల్‌గాంధీ ఫైర్

3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ వాళ్లు అంటారని, బీజేపీ వాళ్ళు బావుల కాడా మీటర్లు పెట్టమంటారని మండిపడ్డారు. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెం.1 గా నిలిచిందన్నారు మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి, ఈ రంగంపై ఆధారపడిన మత్స్యకారులకు ప్రత్యక్షంగా, ఈ రంగంపై ఆధారపడిన పరోక్షంగా ఉపాధి లభించేలా ప్రభుత్వం వారికి ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందిస్తున్నామన్నారు. వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆయా వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నదని.. గౌడ సోదరులకు తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమే గాక, పాత బకాయిలనూ మాఫీ చేసిందని హరీష్‌ రావు పేర్కొన్నారు.

Also Read : Errabelli Dayakar Rao : మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాల‌న్నదే నా సంక‌ల్పం