NTV Telugu Site icon

Harish Rao : ఆర్ధికమంత్రి భట్టి గోబెల్స్‌ని మించిపోతున్నారు

Harish Rao

Harish Rao

Harish Rao : గ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్త.. ఎకరం లోపు భూమి ఉన్నవారిని కూలీలుగా గుర్తించి 12 వేలు ఇవ్వాల్సిందే అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ధికమంత్రి భట్టి గోబెల్స్ ని మించిపోతున్నారని, పూటకో తీరు ఆయన మాట్లాడుతున్నారన్నారు. నిన్న నాగర్ కర్నూల్ లో BRS హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారని, మేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నీరిచ్చామన్నారు. భట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం…ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా అని ఆయన సవాల్‌ విసిరారు. అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్దాలు మాట్లాడారని, మా హయాంలో 4 లక్షల కోట్ల అప్పు ఉంటే 8 లక్షలు అంటూ చెబుతున్నారన్నారు. మీరు పక్కకు పెట్టిన రాజోలి బండని పూర్తి చేశాం, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామని హరీష్‌ రావు అన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తుందని ఆయన మండిపడ్డారు.

Norway: ఈ దేశం ప్రపంచానికి ఆదర్శం! దాదాపు 90% ఎలక్ట్రిక్ వాహనాలే?

సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ…చేతలు గడప దాటడం లేదని, 2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారన్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలని, కేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడన్నారు. కాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలని, రైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు హరీష్‌ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి… మనకి రావాల్సిన పథకాలు తీసుకుందామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..? అని ఆయన అన్నారు. కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారని, మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలన్నారు.

Delhi: కిషన్ రెడ్డి నివాసంలో సినీ ప్రముఖుల సందడి

Show comments