NTV Telugu Site icon

Harish Rao : గజ్వేల్ అభివృద్ధి కాలేదు అంటే సూర్యని మీద ఉమ్మేసినట్టే

Harish Rao

Harish Rao

కాంగ్రెస్ సీనియర్‌ నేత షబ్బీర్ ఆలీపై మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. మొన్న షబ్బీర్ అలీ గజ్వేల్ కి వచ్చి గజ్వేల్ నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందలేదు అన్నాడని, గజ్వేల్ అభివృద్ధి కాలేదు అంటే సూర్యని మీద ఉమ్మేసినట్టే అని హరీష్‌ రావు మండిపడ్డారు. సూర్యుడి మీద ఉమ్మితే మీ మొఖం మీదే పడుతుందని, ఇంత కంటే పెద్ద అబద్ధం ఏమన్నా ఉంటుందా అని మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. షబ్బీర్ అలీ మంత్రిగా ఉన్నప్పుడు తూప్రాన్ నుంచే కామారెడ్డికి పోయేవారని, అప్పుడు రోడ్డు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది షబ్బీర్ అలీకి తెలియదా..?.. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్వేల్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తెలియదా..? ఇంకా ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా..? అని ఆయన ప్రశ్నించారు. మనోహరాబాద్ మండలం చేయాలన్న దశాబ్దల కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారన్నారు హరీష్‌ రావు.

Also Read : RGV: ఒక అమ్మాయిపై పడ్డ ఆర్జీవీ కళ్లు… ఊరు పేరు తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్

ఈ రోజు మనోహరాబాద్ మండలమైందని, ఈ మండలంలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీ ప్రారంభించుకుంటున్నామన్నారు హరీష్‌ రావు. ఉచితంగా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ప్రజలకు ఉంటాయ‌న్నారు. గర్భిణీలకు చెకప్‌లు కూడా ఇక్కడ జరుగుతాయని మంత్రి తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మనోహరాబాద్ మండలం అయ్యేదా..? ఇక్కడ ఇంతటి అభివృద్ధి జరిగేదా? అని మంత్రి అడిగారు. త్వరలో మనోహరాబాద్‌కు పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిల్లో 76 శాతం డెలివరీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే కేసీఆర్ కిట్ తెచ్చి డెలివరీ అయ్యాక అమ్మ ఒడి వాహ‌నాల్లో ఇంటి దగ్గర దింపుతున్నాం. ఈ రోజు పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కష్టాలు తీరుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు.

Also Read : Minister Niranjan Reddy: ఎరువులపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష.. అధికారులకు పలు ఆదేశాలు