Harish Rao : తెలంగాణ సమాజంలో సానుభూతి ఎక్కువ.. అందుకు కాంగ్రెస్ గెలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో నేడు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు ఏదీ శాశ్వతం కాదు. పత్రిపక్షంలో ఉన్నవాళ్లు అధికారంలోకి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మా పార్టీ పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడమని ఆయన అన్నారు.
మేం అధికారంలోకి వచ్చాక కరెంట్ సమస్యలు పరిష్కరించామన్న హరీష్ రావు.. రాష్ట్రంలో 5 ఉన్న మెడికల్ కాలేజీలను 31కి పెంచామని ఉద్ఘాటించారు. అంతేకాకుండా.. వైద్యాన్ని, వైద్యవిద్యను అందుబాటులోకి తెచ్చామని, ఐటీ అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఐటీ ఉత్పత్తులను పెంచాం. కొత్త జిల్లాలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
Also Read
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
అయితే.. దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందని ఆయన అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పోని కరెంటు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు పోతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు అడ్మినిస్ట్రేషన్ రావడం లేదని.. ఆ విషయాన్ని వారు ఒప్పుకోరని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ నేరవేర్చలేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటివరకు టీఎస్ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్ రావు అన్నారు. మేము ఎన్నికల ముందు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ డబ్బునే ఇప్పుడు ఇచ్చారని.. కానీ.. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు.
తెలంగాణ సమాజంలో సానుభూతి ఎక్కువ అని, కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలుగా అధికారంలోకి రాలేదని ఓ సారి అవకాశం ఇద్దామనే సానుభూతితోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటులు అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేతల హామీలు.. అమలు చేశారా లేదా… అనేది ప్రజలకు తెలుసు అని.. ఇదే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు హరీష్ రావు.
తాజావార్తలు
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!