Harish Rao : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లాలోని గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సునీతా ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు. మొన్న సిద్దిపేటలో నా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగిందని, నిన్న కౌశిక్ రెడ్డిపై, అర్థరాత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీష్ రావు మండిపడ్డారు. బీహార్, రాయలసీమ ఫ్యాక్షన్ లా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడని హరీష్ రావు విమర్శించారు. నిన్న జరిగిన దాడి కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించిందే…ఉద్దేశపూర్వకంగా నే మాపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. ఎస్పీ, ఐజీతో మాట్లాడను వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అని, వీడియోలు తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా కాంగ్రెస్ న్నాయకులు దాడి చేశారన్నారు హరీష్ రావు.
Kashi: తిరుపతి లడ్డు తిన్నందుకు.. సనాతన పద్ధతిలో శుద్ధి.. ప్రక్రియ ఇదే!
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ఒకప్పుడు తెలంగాణ పోలీసులు మంచిగా పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా పని చేస్తున్నారని, గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి…వాళ్లపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అవసరం అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని, కోర్టు మెట్లు ఎక్కుతాం…మా ఓపికకి కూడా హద్దు ఉంటుందన్నారు హరీష్ రావు. ఓపికపోతే రాయలసీమ తరహా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలవుతాయని, డీజీపీ ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీజీపీ స్పందించకపోతే BRS ఎమ్మెల్యేలు అందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!