Site icon NTV Telugu

Harish Rao : రైతుబంధుకు నేటితో ఐదేళ్లు.!

Harish Rao

Harish Rao

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే.. రైతు బంధు పథకం ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా నేపథ్యంలో వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు. ‘రైతుబంధుకు నేటితో ఐదేళ్లు.! సీఎం కేసీఆర్ గారి ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు వ్యవసాయాన్ని, పండగ చేసి రైతన్నను రాజును చేసింది. ఎకరాకు ఏడాదికి 10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్ మోడల్ అయ్యింది. అందుకే సీఎం కేసీఆర్ గారు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తున్నాయి. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాయి.’ అంటూ మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : PM Modi: కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులపై మెతక వైఖరి అవలంభిస్తోంది.

రైతుబంధు పథకం ద్వారా రైతులందరికీ యాసంగి, వానాకాలం సీజన్లకు కలిపి ఏడాదికి ఎకారానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే. తొలుత ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. ఆ తర్వాత రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

Also Read : Imran Khan: రణరంగంగా పాకిస్తాన్.. ఇంటర్నెట్ బ్లాక్.. ఆర్మీ ఆధీనంలోకి పంజాబ్..

Exit mobile version